డి శ్రీనివాస్ కు వైయస్ జగన్ షాక్

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టకూడదని ప్రకాశం జిల్లాలో యువజన కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ను అడ్డుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కరీంనగర్ జిల్లా నేతలు అన్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జగన్ కు మద్దతుగా కాంగ్రెసు కార్యాలయంలో పెద్ద యెత్తున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications