మీ అందరితో ఉంటా: జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, వైయస్సార్ మన అందరి జీవితాలను ప్రభావితం చేశారని, కాబట్టే నాన్న చనిపోయినా మీరంతా లక్షలాదిగా తరలి వచ్చి తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, మీ వెంట ఉంటామని తనకు ధైర్యం చెప్పారని ఆయన అన్నారు. మీరంతా ఇచ్చిన కొండంత బలం ఇచ్చారని, అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెద్ద పీడకల అయితే బాగుండనని అనిపిస్తోందని ఆయన అన్నారు. తాను పావురాల గుట్టకు వెళ్లి వచ్చానని, పావురాల గుట్టను తలుచుకున్నప్పుడల్లా నాన్న గుర్తు వస్తారని ఆయన అన్నారు. గత 20 రోజులుగా మీరంతా తనపై అభిమానం, ఆదరణ చూపారంటూ ప్రజలనుద్దేశించి జగన్ అన్నారు. తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, అందుకు రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications