గీత దాటవద్దు: కెవిపి పిలుపు

ఆయన లేఖలోని ఇతర విషయాలు:
''పార్టీ సభ్యత్వ నమోదుపై పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్స్ లకు అంతరాయం కలుగుతున్నదని, క్రమశిక్షణ గలిగిన పార్టీ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న వార్తలు విని నేనెంతో బాధపడుతున్నాను.
అయితే, ఈ విషాద సమయంలో, నేటి పరిస్థితులకు అనుగుణంగా ఓర్పు వహించాలని. మన చర్యలతో అధిష్ఠానం మరింత బలోపేతం కావాలి. పార్టీ అధినాయకత్వపు నిర్ణయాలను ఉల్లంఘించేలా, ఎదిరించేలా చర్యలు ఉండరాదని ప్రతి ఒక్క కాంగ్రెసు కార్యకర్తకు నేను మరొక్కసారి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
పార్టీ జిల్లా కార్యాలయాలకు తాళాలు వేయడం, టెలీకాన్ఫరెన్స్ లను అడ్డుకోవడం, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ సభ్యత్వ నమోదు ప్రక్రియను స్తంభింపచేయడం సరైనా చర్యలు కాదు. క్రింది స్థాయి నేత నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెసు నేతా అధిష్ఠానం ఆదేశాలను తుచ తప్పకుండా స్ఫూర్తితో గౌరవించాలి. మన ప్రియతమ నేత డాక్టర్ వైయస్సార్ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పృదయాల్లోనే కాక పార్టీ నాయకత్వం హృదయంలోనూ శాశ్వత స్థానం పొందారు. మనం గీత దాటవద్దు. అందువల్ల పార్టీ ప్రతిష్ట, డాక్టర్ వైయస్సార్ పేరు దెబ్బ తింటాయి.
పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని నేను పిలుపునిస్తున్నాను. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేద్దాం. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న మీ ఆందోళనను అధిష్ఠానం అర్థం చేసుకుంది. మనమంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి, డాక్టర్ వైయస్సార్, కాంగ్రెసు ప్రతిష్టను ఇనుమడింప జేద్దాం.
పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్లా మనమంతా పనిచేద్దాం. అందరం మద్దతునిచ్చి సోనియా గాందీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని బలపరుద్దాం. పార్టీ అధిష్ఠానాన్ని పటిష్ట పరుద్దాం. ఇదే డాక్టర్ వైయస్సార్ కు నిజమైన నివాళి."












Click it and Unblock the Notifications