హైదరాబాద్: పార్టీ అధినేత్రి ఫొటోలు చించేయడం కంటే మరో దుర్మార్గమైన చర్య లేదని ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు.రెండు రోజుల క్రితం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా కార్యాలయంలో రభసపై ఆమె తీవ్రంగా స్పందించారు. గూండాగిరి చేయడం సరైన పద్దతి కాదని, పార్టీ క్రమ శిక్షణకు విరుద్దమని ఆమె పేర్కొన్నారు