గాంధీ జయంతికి 947 మంది జీవితఖైదులు విడుదల

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 947 మంది సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని నిర్ణయించినా జి.సతీష్ అనే న్యాయవాది ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వెయ్యడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ సుప్రీం కోర్టు ఆయన పిటీషన్ తిరస్కరించడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు హోం మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డి పలుమార్లు జైళ్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అర్హులైన ఖైదీల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జైళ్ల శాఖకు ప్రభుత్వం గురువారం పంపనుంది.












Click it and Unblock the Notifications