అమెరికాలో గాంధీ వేళ్లు: ఒబామా

మహాత్మా గాంధీ అహింసాయుత పద్ధతిలో నడిపిన భారత స్వాతంత్ర్యోద్యమ వేళ్లు నేటి అమెరికా సమాజంలో ఉన్నాయని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ బోధనలకు, జీవితానికి ఆయన జయంతి సందర్భంగా అమెరికా ప్రజలు నివాళులర్పిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల, రాజకీయ ఉద్యమాలను అహింసా సందేశాన్ని ప్రతిబింబించాల్సిన సందర్భం నేటి అవసరమని ఆయన అన్నారు. సహనశీలత ద్వారా, అహింసాయుత పద్ధతిలో ప్రతిఘటనోద్యమాన్ని నడిపి సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ ఆత్మశాంతి కోసం జరుపుకునే కార్యక్రమంలో అమెరికన్లు భాగస్వాములవుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications