చెన్నై: కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రయాణిస్తున్న కోయంబత్తూరుకు చెందిన విమానం శుక్రవారం అర్థాంతరంగా చెన్నై విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో అది తిరిగి చెన్నైలో దిగింది. విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం బయట పడిందని, దీంతో చెన్నైకి తిరిగి వచ్చిందని అధికారులు చెప్పారు.చిదంబరంతో పాటు ఇతర ప్రయాణికులను మరో విమానంలో కోయంబత్తూరుకు పంపించారు.