ఆంధ్రరాష్ట్రం వర్షాలతో అతలాకుతలం, 26కు చేరిన వరద మృతులు

Heavy Rains
హైదరాబాద్: రాష్ట్రంలో వరద తాకిడికి మరణించినవారి సంఖ్య 26కు చేరింది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకున్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలు తీవ్ర వరద తాకిడికి గురయ్యారు. కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. ప్రజలు భారీ భవంతులపైకి, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణానదిలో 13 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

వేలాది మంది ప్రజలు సాయం కోసం వరదల్లో చిక్కుకుని ఎదురు చూస్తున్నారు. 13 వేల ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. గత రెండు రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం జలశయానికి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పై నుంచి పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పొంగి పొర్లుతుండడంతో కర్నూలు జిల్లా పరిస్థితి దారుణంగా తయారైంది. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల పెద్ద యెత్తున ప్రమాదం పొంచి ఉంది. మంత్రాలయం వద్ద బస్సు నీటిలో చిక్కుకుంది. 30 మంది ప్రయాణికులు బస్సు టాప్ పైకి ఎక్కి సాయం కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దీంతో దాని కింద ఉన్న రెండు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+