భారీ వర్షాలతో నీట మునిగిన మంత్రాలయం

Mantralayam
కర్నూలు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పూర్తిగా నీట మునిగింది. ఇళ్లన్నీ మునిగిపోయాయి. ప్రజలు భారీ భవంతులు, గుడులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వందలాది పశువులు నీట కొట్టుకుపోయాయియ మంత్రాలయం మండలం రాంపురంలో వరదనీటిలో చిక్కుకుని ఇద్దరు గల్లంతయ్యారు. మంత్రాలయంలో ఆర్టీసి బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుంది. బస్సుపైకి ఎక్కి 30 మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కర్నూలు పట్టణం అతలాకుతలమైంది.నగరంలోని పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యుల ఇళ్లు కూడా నీట మునిగాయి. కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇల్లు జల దిగ్భంధంలో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శాసనసభ్యులు టి.జి. వెంకటేష్, కె.ఇ. ప్రభాకర్, మేయర్ రఘురామిరెడ్డి ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని 30 కాలనీల్లో 5 అడుగుల మేర నీరు చేరింది.

కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సుంకేశుల బ్యారేదీ నుంచి 6.12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సుంకేశుల బ్యారేజీకి గండి పడింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+