పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మావోయిస్టుల నుంచి ఎస్ఎంఎస్ బెదిరింపు వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. జైలు నుంచి తమ ముఖ్య నాయకులను ఇద్దరిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మావోయిస్టులు ఆ బెదిరింపులు చేశారు. డాబ్లూ అనే నక్సలైట్ నాయకుడి పేరు మీద 09308670993 నుంచి ఆ మెస్సేజ్ ఒక ప్రైవేట్ టీవీ చానెల్ రిపోర్టకు వచ్చిందని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అమీర్ సుభాని చెప్పారు.
తమ నాయకులు రవీజి, దిరేన్ సింగ్ లను వదిలేయాలని ఆ మెస్సేజ్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసు డైరెక్టర్ జనరల్, ఎస్ కె భరద్వాజ్ స్వయంగా దర్యాప్తు చేశారు. ముఖ్యమంత్రి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.