సోనియా మాతృ సమానురాలు: జగన్

YS Jaganmohan Reddy
కడప: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు మాతృ సమానురాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం కడపలో కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోనియా నాయకత్వాన్ని బలపరుద్దామని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని కూడా ఆయన సూచించారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం బెంగుళూరు నుంచి కడప జిల్లాలోని తన స్వస్థలం ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అక్కడి నుంచి కడపకు బయలుదేరి వచ్చారు. నల్ల కాలువలో వైయస్ రాజశేఖర రెడ్డి సంతాప సభలో పాల్గొని ఆయన అక్కడి నుంచి నేరుగా బెంగుళూర్ వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+