కర్నాటకలో 118 మంది మృతి

ప్రస్తుతం వరద తాకిడికి గురైన చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులే నెలకొని ఉన్నాయి. బళ్లారి జిల్లాలో 11 మంది మరణించారు. బెల్గాం జిల్లాలో ఆరుగురు, గడగ్ జిల్లాలో ఐదుగురు మరణించారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 30 వేల ఇళ్లు కూలిపోయాయి. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సైన్యాన్ని, నావికా, వైమానిక దళాలను ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రంగంలోకి దింపారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డు మార్గాలు కూడా తెగిపోయాయి. ఇళ్లు కూలిపోయిన వారికి ఆశ్రయ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
గోవాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమై పోయారు. దాదాపు 250 ఇళ్లు కూలిపోయాయి. ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. వరద తాకిడికి ఇద్దరు మరణించినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications