హైదరాబాద్: మగధీర సినిమా హీరో, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయం కోసం ఆయన శనివారం ఆ విరాళం ప్రకటించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన తన అభిమానులకు పిలుపునిచ్చారు.వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని బాలకృష్ణ, వెంకటేష్ ఇతర హీరోలు తమ అభిమానులకు పిలుపునిచ్చారు.