హైదరాబాద్ :హుస్సేన్‌సాగర్‌పై ఆనకట్ట నిర్మించాలని ఆదివారం నాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసున్నది. హైదరాబాద్ నగరం ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ఈ కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో వరద పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాతబస్తీ సహా ఏటా ముంపు ప్రమాదం పొంచి వున్న 50కి పైగా కాలనీలకు శాశ్వత రక్షణ కవచం ఏర్పడుతుందని అంచనా.