ముంబై: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తన స్వప్నమని బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ అన్నారు. నవీ ముంబైలోని ఎన్నికల ర్యాలీలో శుక్రవారం రాత్రి మాట్లాడుతూ ఆయన ఆ విధంగా అన్నారు. రామ మందిర నిర్మాణం జరిగే వరకు తాను సోమనాథ్ ఆలయానికి వస్తుంటానని ఆయన గత నెలలో అన్నారు. కాంగ్రెసు పాలనను ఆయన బ్రిటిష్ పాలనతో పోల్చారు. శివసేన, బిజెపి కూటమికి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.
బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత సురాజ్యం వస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, అయితే కాంగ్రెసు బ్రిటిష్ పాలననే సాగిస్తోందని, ప్రజలను ద్రవ్యోల్బణంలోకి, కరువులోకి నెట్టిందని ఆయన అన్నారు.