పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పై దాడి

గ్రెనేడ్లు విసిరి ఉగ్రవాదులు లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు రావల్పిండి సైనిక కేంద్ర కార్యాలయం వద్దకు వాహనంలో వచ్చారు. భారీ పేలుడు పదార్థాలున్న వాహనంతో లోనికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారని పోలీసు అధికారి మొహమ్మద్ జమీల్ చెప్పారు. ఉగ్రవాదులు వాహనం నుంచి దిగి కాల్పులు ప్రారంభించారని, సైనికులు ఎదురు కాల్పులు మొదలు పెట్టారని, కాల్పులు ఇంకా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications