ఆదిలాబాద్: పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు పరారయ్యారు. ఈ సంఘటన రేండ్లగూడ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగజ్‌నగర్ మండలం రేండ్లగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 8 మంది నక్సల్స్ తారసపడ్డారు. పోలీసులను గుర్తించిన వీరు వెంటనే కిట్ బ్యాగులు, కొద్దిపాటి ఆయుధ సామాగ్రిని వదిలి వేసి పారిపోయారు. వీటిని స్వాధీనం చేసుకున్న గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.