ఓటేసిన సచిన్, అంబానీ, పవార్

Sachin Tendulkar
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మంగళవారం ఉదయమే కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్, కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్, పారిశ్రామితవేత్త అనిల్ అంబానీ, ముంబై పోలీసు చీఫ్ డి. శివానందన్, బిసిసిఐ చీఫ్ శశాంక్ మనోహర్, మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేతో కలిసి వచ్చి పూనే జిల్లాలోని బారామతి పోలింగ్ స్టేషనులో ఓటేశారు.

రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని, ధరల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపదని శరద్ పవార్ అన్నారు. దేశ్ ముఖ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లాతూరు జిల్లాలోని తన సొంత గ్రామం భాబల్ గావ్ లో ఓటేశారు. కాంగ్రెసు - ఎన్సీపి కూటమికి మెజారిటీ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కూతురు, షోలాపూర్ కాంగ్రెసు అభ్యర్థి ప్రణతి షిండే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్, బిజెపి అభ్యర్థి పూనమ్ మహాజన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+