ఇక జై తెలంగాణ ఉధృతం: కెసిఆర్

సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ, క్షేత్రస్థాయి ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కార్యక్రమంపై ఈ నెల 15వ తేదీన జరిగే పార్టీ పోలిట్ బ్యూరో, కార్యవర్గ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకంటామని ఆయన చెప్పారు. ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన విమర్శించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. తనను బేతాళమాంత్రిడు అని అన్న కాంగ్రెసు నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. హరిరామ జోగయ్య ఎవరి మేలు కాంక్షించి ఆ ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. తమకు తెలివి లేక, పౌరుషం లేక మిన్నకుండలేదని, మానవతా దృక్పథంతో వ్యవహరించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications