హైదరాబాద్: మహాత్మా సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. చిత్ర నిర్మాత పిఆర్ మనోహర్ పై హైదరాబాదులోని మొగల్ పురా పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. మహాత్మా సినిమా పోస్టర్లపై సెన్సార్ సర్టిఫికెట్ యుఎను ముద్రించలేదని ఆరోపిస్తూ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాంత్ వందో చిత్రంగా వచ్చిన మహాత్మా ఇది వరకు కూడా వివాదంలో చిక్కుకుంది. మహాత్మా సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ లక్ష్మణ్ అనే రచయిత హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.