జార్ఖండ్ లో ఆంధ్రా నక్సల్స్ అరెస్టు

రవిశర్మ ఎకె 47 రైఫిల్ పట్టుకుని ఇతర నక్సలైట్లతో సాయుధ శిక్షణ పొందుతున్న చిత్రాలున్న సిడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్, నాలుగు కాట్రడ్జిజెస్, 60 వేల రూపాయల నగదు, ల్యాప్ ట్యాప్, బ్యాంక్ పాస్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని ఈ నెల 10వ తేదీన అరెస్టు చేసినట్లు హజారీబాగ్ పోలీసు సూపరింటిండెంట్ పంకజ్ కాంబోజ్ చెప్పారు. రవిశర్మ మేధావి అని, పలు కేసుల్లో ఇతను సూత్రధారి అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రవి శర్మ అలియాస్ అర్జున్ అలియాస్ మహేష్ అలియాస్ అశోక్, ఆయన భార్య బి అనురాధ అలియాస్ రజిత 1999 నుంచి బీహార్, జార్ఖండ్ ల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications