వైయస్ జగన్ పై తొందరపాటు ఉండదు: వివేకా

Anam Vivekananda Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచినప్పుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెసు నాయకుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు. జగన్ ఢిల్లీ ఎప్పుడైనా వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లే అంశం ప్రజాసమస్య కాదని, పార్టీ అధిష్ఠానం పిలిచినప్పుడు జగన్ ఢిల్లీ వెళ్తారని, ఆ పిలుపు ఎప్పుడైనా రావచ్చునని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీగా ఆయన శుక్రవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

పులివెందుల శాసనసభ ఉప ఎన్నిక అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. వైయస్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. పార్టీలో జగన్ వర్గం, రోశయ్య వర్గం అనేవి లేవని, ఆవన్నీ మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తమది ఒక్కటే కాంగ్రెసు వర్గమని ఆయన అన్నారు. తాము తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలూ తెలుసునని, అధిష్టానమే అన్నీ చూసుకుంటుందని ఆయన అన్నారు. ప్రజల, మెజారిటీ శాసనసభ్యులు మనోగతాన్ని సోనియా గౌరవిస్తారని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+