శ్రీకాకుళం: చైనాలో ఎంబిబియస్ చదువుతున్న ఆంధ్రా విద్యార్థి చైనాలో మరణించాడు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామిడి సందీప్ చక్రవర్తి అనే విద్యార్థి తన గదిలో మృతి చెందినట్లు ఇక్కడికి సమాచారం అందింది. మామిడి సందీప్ చక్రవర్తి శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందినవాడు. గత రెండు రోజులుగా పాతపట్నంలోని అతని కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో అక్కడివారికి సమాచారం అందించడంతో వారు గదికి వెళ్లి చూడగా అతను మరణించినట్లు తెలుసిందని అంటున్నారు.