సోనియాతో ముగిసిన వైయస్ జగన్ భేటీ

సోనియాతో భేటీ అనంతరం జగన్ నేరుగా ఆంధ్రాభవన్ కు వెళ్లిపోయారు. బుధవారం న్యూఢిల్లీకి వచ్చిన జగన్ అదే రోజు సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో జగన్ సమావేశమయ్యారు. జగన్ తో భేటీ అనంతరం సోనియా గాంధీ వీరప్ప మొయిలీని తన నివాసానికి పిలిచారు. దీంతో మొయిలీ ఆమె నివాసానికి చేరుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం సంభవించిన పరిణామాలతో తనకు ప్రమేయం లేదని జగన్ సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications