పులివెందులలో వైయస్ జగన్ పోటీ?

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ కడప జిల్లా పులివెందుల సీటు నుంచి శాసనసభకు పోటీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్ధపడిన ఆయన పులివెందుల నుంచి పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో తన పునాదిని పటిష్టపరుచుకోవడానికి ప్రయత్నిస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఖాళీ అయిన పులివెందుల నియోజక వర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ శనివారం వెలువడింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. డిసెంబర్ మూడో వారంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

రాష్ట్ర రాజకీయాల్లోనే తన సేవలు అందిస్తానని ప్రకటించిన జగన్ పులివెందులలో పోటీకే సిద్ధపడతారని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆయన పరోక్షంగా తన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యగా మారడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అందుకు అంగీకరిస్తారా అనేది ప్రశ్నార్థకమే. సోనియా నిర్ణయాన్ని శిరసా వహిస్తానని జగన్ చెప్పుకున్నారు. ఈ స్థితిలో సోనియా పులివెందులలో జగన్ పోటీకి అంగీకరించే పరిస్థితులు లేవని అంటున్నారు. వైయస్ సతీమణి విజయలక్ష్మిని గానీ కూతురు షర్మిళను గానీ పోటీకి పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, జగన్ అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటాయని ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+