అసీస్ లో మరో భారత విద్యార్థిపై దాడి

కూపర్ స్ట్రీట్ లోని ఎప్పింగ్ రైల్వే స్టేషన్ లో సిక్కు విద్యార్థి నిద్రిస్తుండగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆదివారం ఉదయం 12.45 నిమిషాల ప్రాంతంలో 17 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల ఐదుగురు యువకులు ఈ దాడికి పాల్పడినట్లు ది ఏజ్ పత్రిక రాసింది. ఐదుగురిలో ఇద్దరు యువకులు అతన్ని కొడుతుండగా మరో ముగ్గురు ఆపడానికి ప్రయత్నించినట్లు సమాచారం. 60 బస్సు డ్రైవర్, ఇతర ప్రయాణికులు కూడా యువకులను అపడానికి ప్రయత్నించారు. సిక్కు విద్యార్థిని కొట్టిన తర్వాత ఐదుగురు యువకులు కూడా అక్కడి నుంచి పారిపోయారు.సిక్కు విద్యార్థి నోటికి గాయమైందని, అయితే చికిత్స ఏమీ అవసరం లేదని ఆ పత్రిక తెలిపింది.












Click it and Unblock the Notifications