హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కొంత కాలం తమ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ మంత్రి గాదె వెంకట రెడ్డి సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పేరును పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంకా సూచించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత పదవికి ఎవరైనా అర్హులేనని ఆయన అన్నారు. సిఎల్పీ సమావేశంలో ఏక వాక్య తీర్మానమే ఉంటుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిలో రోశయ్యను కొనసాగించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, జగన్ సోనియా నిర్ణయం శిరోధార్యమని ప్రకటించిన నేపథ్యంలో గాదె వెంకటరెడ్డి ఆ విధంగా అన్నారు.