తెలుగుదేశం ఎంపీ ఇంట్లో చోరీ

గత ఎన్నికల్లో శివప్రసాద్ చిత్తూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎర్రమంజిల్ కాలనీలోని మర్కాజ్ మేన్షన్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్నారు. శివప్రసాద్ మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్ళారు. ఆదివారం సాయంత్రం వాచ్ మన్ ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది.
ఈ విషయాన్ని శివప్రసాద్ సోదరి పద్మజా రెడ్డికి తెలియజేయగా అమె వచ్చి పరిశీలించి, శీవప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడి రెండునర లక్షల నగదు మాయమైనట్టు నిర్ధారించుకున్నారు. పంజాగుట్ట పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications