మా వాళ్లు జగన్ ను కలువొచ్చు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: తమ శాసనసభ్యులు కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను కలిస్తే తప్పు లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. తామంతా కలిసే ఉన్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీకి చెందిన గాంధీ, ఎల్లంపల్లి, శ్రీనివాస్ రెడ్డి తదితురులు తనకు చెప్పే జగన్ ను కలిశారని, జగన్ తో భేటీ ఇంత సున్నితంగా ఉంటుందని ఊహించే తనను అనుమతి అడిగారని ఆయన అన్నారు. జగన్ ను తమ పార్టీ నాయకులు కూడా కలిస్తే తప్పా, ఎమ్మెల్యేలు మాత్రమే కలిస్తే తప్పా అని చిరంజీవి అడిగారు. ఎమ్మెల్యేలు కలవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. జగన్ ను కలవడం వల్ల నష్టమేమీ లేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంతాపసభకు వెళ్లడంపై శోభా నాగిరెడ్డి ఇది వరకే వివరణ ఇచ్చారని ఆయన అన్నారు. ఊహాగానాలకు తాను సమాధానం ఇవ్వలేనని ఆయన చెప్పారు. ఎవరు ఎవరిని కలిసినా ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురించి ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఏ సమయంలో ఏం మాట్లాడతారో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను రాష్టానికి చెందినవాడినని అన్నారని, ఇప్పుడు తెలంగాణ జాగో ఆంధ్ర బాగో అనే నినాదం ఇచ్చారని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడడం కెసిఅర్ స్థాయి నాయకుడికి లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+