వైయస్ జగన్ మరో జగడం

డిఎస్ మారుస్తున్న విషయం తనకు తెలియదని తొలుత అన్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తర్వాత జగన్ ను పసిసి అధ్యక్షుడిగా చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వచ్చిన వార్తలను ఖండించారు. కేంద్ర మంత్రి సాయి ప్రతాప్, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డిలతో భేటీ అయిన తర్వాత ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ కూడా ఆ వార్తలను ఖండించారు. జగన్ కు పసిసి అధ్యక్ష పదవి ఇస్తారని షకీల్ అహ్మద్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాను చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా ఎలా టీవీ చానెల్ ప్రసారం చేస్తుందని, దీనిపై చానెల్ ను వివరణ అడుగుతామని ఆయన అన్నారు. జగన్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పడానికి తానెవరినని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications