పెషావర్ లో పేలుడు: 70 మంది మృతి

భారీ పేలుడు సంభవించిందని, ఎక్కడ చూసిన పొగ, ధూళి అలుముకుందని, రోడ్డుపై మనుషులు చచ్చి పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల నుంచి ప్రజలను పోలీసులు ఇతర స్థలాలకు తరలిస్తున్నారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారి షఫ్కాత్ మాలిక్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. దాదాపు 70 మంది మరణించారని, 170 మంది దాకా గాయపడ్డారని వైద్యుడు జాఫర్ ఇక్బాల్ అంటున్నారు. మృతుల్లో 12 మంది మహిళలు, పలువురు పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications