హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఐదో విడత కల్యాణమస్తు కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బుధవారం కల్యాణమస్తు కార్యక్రమాన్ని కన్నులపండుగగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వివహాలు జరిగాయి. హైదరాబాదులోని లలిత కళాతోరణంలో జరిగిన కల్యాణమస్తు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య, గవర్నర్ ఎన్డీ తివారీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐదో విడత కల్యాణమస్తులో 7,700 జంటలు ఒక్కటయ్యాయి.