చిరుతో పొత్తుపై జగన్ క్యాంప్ సీరియస్

YS Jagan
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని చిరంజీవి పార్టీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరం సీరియస్ గా తీసుకుంటోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అధిష్టానాన్ని ఒప్పించి పొత్తును దెబ్బ తీయాలని ఎత్తుగడలు వేస్తోంది. పొత్తు నిర్ణయాన్ని ఈ శిబిరం కుట్రగా భావిస్తోంది. వైయస్ జగన్ సోమవారం ఉదయం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. తమను దెబ్బ తీయడానికి చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలని జగన్ వ్యతిరేక వర్గం కుట్ర పన్నుతోందని జగన్ వర్గీయులు భావిస్తున్నారు.

జగన్ ను సోమవారంనాడు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శాసనసభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, జయసుధ తదితరులు కలిశారు. తాజా పరిణామాలపై వారు జగన్ తో మాట్లాడారు. ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తమ పార్టీకి చెందిన వారి కుట్ర అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పొత్తుకు వ్యతిరేకంగా తాము తీర్మానం చేస్తామని, ఆ తీర్మానాన్ని అందజేసి పొత్తు పెట్టుకోకుండా అధిష్టానాన్నిఒప్పిస్తామని ఆయన అన్నారు.

జగన్ కు అనుకూలంగా ఉన్న రఘువీరా రెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులు, కొంత మంది శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ను అణచివేయడంలో భాగంగానే చిరంజీవితో పొత్తుకు సిద్ధపడినట్లు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ వర్గాన్ని ఎంతగా అణగదొక్కాలనుకుంటే అంతగా పైకి లేస్తుందని మంత్రి రఘువీరా రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+