దిగివచ్చినట్టే కన్పిస్తున్న యడ్యూరప్ప

అందులో భాగంగానే శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీపీ బలిగార్‌ను పరిశ్రమల శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బలిగార్ స్థానంలో ఐఎస్‌ఎన్ ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా అసమ్మతి నేత గాలి జనార్ధన్‌రెడ్డి షరతుల మేరకే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇలా ఉండగా కర్ణాటక రాజకీయాల్లో బళ్లారి మైనింగ్ మాఫియా కీలక పాత్ర పోషిస్తోందని దీన్ని కాంగ్రెస్, భాజపాలు వాడుకుంటున్నాయని సీపీఐ ఆరోపించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా పాలుపంచుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్దన్ ఆరోపించారు. మూడు రోజుల పాటు ఖమ్మంలో జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ, సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణనని ఆయన అన్నారు. మావోయిస్టులపై సైన్యాన్ని ప్రయోగించడం తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications