విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదవ మంత్రి పార్ధసారధిపై దుమారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లాలో కమ్మ, కమ్మేతర (నాన్ కమ్మ) రాజకీయాలు మళ్ళీ పుంజుకున్నాయి. యాదవ కులానికి చెందిన పార్ధసారధిని వైయస్ జిల్లాలో ఏకైక మంత్రిని చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నేరుగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరోక్షంగా పార్ధ సారధి మీద యుద్ధం ప్రకటించారు. తాజాగా టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు ఇలా ధ్వజమెత్తారు. రైతు బిడ్డగా పుట్టాను, రైతు సమస్యలు తీరుస్తానన్న మంత్రి పార్థసారథి మాటలు ఏమయ్యాయని మైలవరం ఎమ్మెల్యే అన్నారు.

ముందుగానే పీల్డ్‌ లోడింగ్‌కు అనుమతి ఇవ్వటంపై మంత్రికి రైతుల సమస్యలపై ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతుంద న్నారు. ఎడి, మంత్రికంట్రోల్‌లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణా, గుంటూ రు జిల్లాలను రెగ్యులేషన్‌ చేయలేకపోవడంపై మంత్రి మాటలను విస్మరించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు బాధలు పట్టని ప్రభుత్వం పేపర్‌ కంపెనీలతో కుమ్మకై్క కోట్లు దండుకుంటున్నారని, వారి సమస్యలు తీ ర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇటీవల గుడివాడ టిడీపి ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు మంత్రి పార్ధసారధి కార్యక్రమాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X