డిఎస్ తో విభేదాలు లేవు: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డిఎస్ పై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని లక్ష్మారెడ్డి డిఎస్ తో భేటీ అనంతరం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో అభ్యర్థులను మార్చాలని తాను డిఎస్ ను కోరానని, ఆ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. స్థానిక శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను మార్చాలని తాను కోరానని, శాసనసభ్యులను విశ్వాసంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications