పాపన్నపేటలో తెరాస నేతల ధర్నా

K Chandrasekhar Rao
మెదక్: ఆంధ్ర వలసవాదుల చేతుల్లో ఉన్న వేయి ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు మెదక్ జిల్లా పాపన్నపేటలోని లక్ష్మీనగర్ లో ధర్నా చేస్తున్నారు. తెరాస నేతలు సోమవారం తమ ధర్నాను ప్రారంభించారు. రాత్రి కూడా వారు అక్కడే ఉండి మంగళవారంనాడు కూడా తమ ధర్నాను సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు.

ధర్నాలో రాజేందర్, హరీష్ రావులతో పాటు శాసనసభ్యుడు రామారావు, మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ దళిత భూముల ఆక్రమణపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనగర్ లో పర్యటించి నిజాలు తెలుసుకోవాలని చర్యలు చేపట్టాలని ఆనయ కమిషన్ ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+