మైనంపల్లి రాజీనామా చేస్తారా: హరీష్

హనుమంతరావు రాఘవాపూర్ కు వచ్చి మీడియా తదితరుల ముందు తనపై చేసిన భూ అక్రమ ఆక్రమణ ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపడతానని హనుమంతరావు చేసిన ప్రకటనపై కూడా ఆయన ప్రతిస్పందించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన బంధువులు రాఘవాపూర్ లో భూములు ఆక్రమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీనగర్ లో ఎవరి మీద కూడా ఆరోపణలు చేయలేదని, దళితుల భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దళితులకు తిరిగి అప్పగించాలని కోరామని ఆయన చెప్పారు. దళితుల భూములను దళితులకు ఇవ్వకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications