రాజమండ్రిలో కేరళ యువతి కిడ్నాప్ మిస్టరీ

తమ ఆస్పత్రిలో థెరపిస్ట్ గా పనిచేస్తున్న ఒక కేరళ యువతిని రవి అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి బలవంతంగా తీసుకునివెళ్లిపోయినట్టు స్థానిక జెండాపంజారోడ్డులోని చరక్ ఆయుర్వేద ఆస్పత్రి డాక్టర్ జామడుగుల జగన్‌మోహనరావు సోమవారం రాత్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం చరక్ ఆయుర్వేద ఆస్పత్రిలో కేరళ రాష్ట్రం ఇద్దుకల్లు మండలం కొలుప్పానియా గ్రామానికి చెందిన నిద్య కృష్ణ ఎలియాస్ అను (22) థెరపిస్ట్‌గా పనిచేస్తోంది. ఆ ఆస్పత్రి ఎదురుగా కుర్చీ వైర్లు అల్లే షాపులో పనిచేసే రవి అనే యువకుడితో నిద్య కృష్ణకు ప్రేమ వ్యవహారం ఉంది. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో రవి మరో ఇద్దరు యువకులతో కలిసి ఆస్పత్రి మేడపై ఉన్న స్టాఫ్‌రూమ్‌లోకి ప్రవేశించి, నిద్య కృష్ణను రవి చేయిపట్టుకుని అడ్డువెళ్లిన ఆస్పత్రి సిబ్బందిని గెంటివేసి ఆమెను తీసుకువెళ్లిపోయాడు. త్రీటౌన్ ఎస్సై వై.రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications