రోశయ్యతో వైయస్ జగన్ ఢీ

ప్రభుత్వం విశ్వసనీయతను పెంచుకోవాలని, గతంలో వైయస్సార్ విశ్వసనీయతే పార్టీ బలమైందని జగన్ అన్నారు. వైయస్సార్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుత్తు కంపెనీలు 20 శాతం విద్యుత్తును అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవోను రద్దు చేసి లేదా విద్యుత్తును కొనుగోలు చేసి రైతులకు 9 గంటలు విద్యుత్తు ఇవ్వాల్సిందేనని జగన్ అన్నారు. దానికి రోశయ్య స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలు 20 శాతం విద్యుత్తును అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లోని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తాను మార్పు చేయలేదని చెప్పారు. జగన్ ను మంత్రి బొత్సా సత్యనారాయణ సమర్థించే ప్రయత్నం చేశారు. దానికి రోశయ్య చురక వేశారు. దాంతో బొత్సా వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications