ఎన్ ఎంయుతో యాదవ్ చర్చలు వాయిదా

SSP Yadav
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ ఎంయు) నాయకులతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్పీ యాదవ్ గురువారం చర్చలు ప్రారంభించారు. ఎన్ఎంయు నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో శనివారానికి వాయిదా పడ్డాయి. వేతన సవరణ, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని ఎన్ఎంయు ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రావు మీడియా ప్రతినిధులతో అన్నారు.

కాగా, ఆర్టీసి కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు. యూనియన్ నేతలతో తమ యాజమాన్యం చర్చలు జరుపుతోందని, ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని ఆయన కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష గురించి విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ఉద్యమంలో అలాంటివి తాను ఎన్నో చేశానని ఆయన జవాబిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+