రోజాపై భువనేశ్వరి రుసరుసలు

రోజాను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి భువనేశ్వరి వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేసిన రోజాను చేర్చుకోవడం మంచిది కాదని ఆమె చంద్రబాబుతో అన్నట్లు వినికిడి. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎర్రంనాయుడు తదితరులతో అన్నారని సమాచారం. పార్టీపై విమర్శలు చేసి ప్రజారాజ్యంలోకి వెళ్లి మళ్లీ వచ్చిన టి. దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాంలను చేర్చుకున్నప్పుడు రోజాను చేర్చుకోవడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారు చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications