చంద్రబాబు మాట తప్పారు: జగన్

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడు కారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్య నిషేధం విషయంలో చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు. ఆయన రెండో రోజు శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెసుకు ఓటేసి సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని బలపరచాలని ఆయన ప్రజలను కోరారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డుల కోసం ప్రజలు చెప్పులరిగేలా తిరిగారని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించి తన తండ్రికి నివాళిగా అంకితమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇచ్చిన మాట మీద నిలబడినవారికే విశ్వసనీయత ఉంటుందని, ఇచ్చిన మాట నిలబెట్టేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని ఆయన అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కేవలం 600 ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. వైయస్ హయాంలో 78 వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలనలో పాలనలో 7 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+