లారీని ఢీకొన్న పెళ్లి వ్యాన్: 8మంది మృతి

శనివారం రాత్రి తిరుమలలో వివాహం అయిన తర్వాత ఆదివారం పెళ్లి బృందం స్వగ్రామానికి టెంపో, క్వాలిస్ వాహనాల్లో బయలుదేరింది. వధూవరులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, తమ్ముడు, బాబాయి, నాయనమ్మ, పిన్నమ్మ, డ్రైవర్, మరో వ్యక్తి కోటేశ్వరరావు ప్రమాదంలో మరణించారు.
పెళ్లి కొడుకు మామ వేణుగోపాల్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. పెళ్లి కూతురు మధులత బెంగుళూర్ వాస్తవ్యురాలు. మృతులను ఆంజనేయులు, పుష్పవతి, శ్రీకాంత్, రమేష్, ఆదెమ్మ, ఆత్మకూరి సుబ్బరత్నం, కోటేశ్వరరావులుగా గుర్తించారు. డ్రైవర్ కూడా మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications