విశాఖపట్నం: అవసరమైతే కరవు మండలాల జాబితాను పెంచుతామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన బుధవారం ఈ విషయం చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అధికారులు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ జిల్లాల్లో కరవు నివారణ చర్యలు, వ్యవసాయం, పశు సంవర్ధకం, ఉపాధి హామీ, మంచినీరు, ఆరోగ్యం తదితర సమస్యలపై ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
రెండు రోజుల పర్యటన కోసం ఆనయ బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమావేశాలు ఒంటి గంట వరకు సాగుతాయి. బుధవారం సిఎం ఐదు అధికారిక, మూడు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.