హైదరాబాద్ లో వాడిపోతున్న 'కమలం'

గతంలో హైదరాబాదులో బిజెపి శాసనసభా స్థానాలను కూడా గెలుస్తూ వచ్చింది. మలక్ పేట వంటి శాసనసభా నియోజకవర్గాల్లో కూడా బిజెపి పూర్తిగా బలహీన పడిపోయింది. దీనికి ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు కూడా కారణంగా చెప్పవచ్చు. యువత ఎక్కువగా బిజెపి వైపు ఉంటూ వచ్చింది. ఇప్పుడు యువత ఎక్కువగా చిరంజీవి, జయప్రకాష్ వైపు మళ్లినట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు, చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి వైపు కూడా మళ్లారు. గత ఎన్నికల్లో హిమాయత్ నగర్ శాసనాసభా స్థానాన్ని మాత్రమే బిజెపి గెలుచుకుంది. అందుకు కాంగ్రెసు స్థానికేతరుడిని పోటీకి పెట్టడం, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పోటీలో ఉండడం, కిషన్ రెడ్డిపై ప్రజల్లో మంచి పేరు ఉండడం కారణాలు. పైగా, బిజెపి నాయకత్వంలో తీవ్ర స్థాయిలో కుమ్ములాటలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications