హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిశ్రమ ఫలితాలు: గ్రేటర్ లో పై'చేయి'

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి కూడా ఏకపక్షంగా విజయం చేకూరలేదు. మొత్తం 150 డివిజన్లలో 70 డివిజన్ల దాకా గెలుచుకుంటామని కాంగ్రెసు ధీమా వ్యక్తం చేసినా 52 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 72 డివిజన్లలో కాంగ్రెసు ఆధిక్యత సాధించింది. ఆ ఆధిక్యత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వచ్చేసరికి 52కు పరిమితమైంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అతి పెద్దగా అవతరించడం కాంగ్రెసుకు కొంత మేరకు ఊరట. హైదరాబాద్ శివారులో కాంగ్రెసు పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. సికింద్రాబాదులో మాత్రం తన ఆధిక్యతను ప్రదర్శించింది.

తెలుగుదేశం, మజ్లీస్ పార్టీలు పోటాపోటీగా స్థానాలు సాధించాయి. కాంగ్రెసుకు ధీటుగా తెలుగదేశం పార్టీకి 45 స్థానాలు లభించాయి. మజ్లీస్ పార్టీ ఆ రెండు పార్టీలకు పోటీగా స్థానాలు దక్కించుకుంది. పాతబస్తీలో ఏకపక్షంగా మజ్లీస్ విజయం సాధించిందని చెప్పవచ్చు. మజ్లీస్ 43 డివిజన్లలో విజయబావుటా ఎగురేసింది. చిన్న పార్టీలను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చితగ్గొట్టారు. బిజెపికి ఐదు స్థానాలు దక్కాయి. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఎట్టకేలకు ఒక్క సీటును గెలుచుకుంది. ఇతరులు నాలుగు సీట్లు గెలుచుకున్నారు. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా పార్టీ పత్తా లేకుండా పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X