జగన్ హడావిడి: పెద్దాయనకు లైన్ క్లియర్

కాగా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెసు శాసనసభ్యులు ప్రకటిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయనందుకు కలత చెంది మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అధిష్టానం చెప్పినట్లే జరుగుతుందని సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలకు అవకాశమిస్తే మాట్లాడ్తామని ఆయన చెప్పారు. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టిజి వెంకటేష్, తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. కాంగ్రెసు సిఎల్పీ సమావేశానికి కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వచ్చారు. సిఎల్పీ నేతగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు జగన్ ను ప్రణబ్, మొయిలీ ఒప్పించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications