అరు డివిజన్లలో గెలిపించిన జయసుధ

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి గ్రేటర్ ఎన్నికల్లో చుక్కెదురైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో టీడీపీ విజయం సాధించడంతో ముందస్తు అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పోరులో హోమంత్రి, ఆమె అనుచరులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. పట్టణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉన్న ఈరెండు డివిజన్లలో అందరి అంచనాలకు భిన్నంగా ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. మొదటినుంచీ కాంగ్రెస్‌కు బాగా పట్టున్న సరూర్‌నగర్ డివిజన్‌లో టీడీపీ విజయం సాధించడం రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసింది. రామకృష్ణాపురం డివిజన్‌లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు.


Click it and Unblock the Notifications