సిఎల్పీ నేతగా రోశయ్య ఏకగ్రీవ ఎన్నిక

నాటకీయంగా జరిగిన పరిణామాల మధ్య ఎట్టకేలకు సిఎల్పీ సమావేశం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు వీరప్ప మొయిలీ సిఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సమావేశం తొలుత సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత వరద మృతులకు సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత సిఎల్పీ నేత ఎంపిక జరిగింది. సిఎల్పీ నేత ఎంపిక విషయాన్ని సోనియాకు అప్పగిస్తూ వైయస్ జగన్ తీర్మానం ప్రతిపాదించారు. సిఎల్పీ సమావేశానికి పార్లమెంటు సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్ దూరంగా ఉన్నారు. శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కాస్తా ఆలస్యంగా వచ్చారు.












Click it and Unblock the Notifications